కోలీవుడ్ కి ఎంటర్ అవుతున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor to Enter KollywoodJanhvi Kapoor to Enter Kollywood


నిన్నమొన్నటివరకు సౌత్ కి ఎంట్రీ ఇచ్చేందుకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చాలా ఆలోచించింది. ఒకసారి డెసిషన్ తీసుకున్నాక పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకుంది. రెండు సినిమాలు జాన్వీ కపూర్ ని డిజప్పాయింట్ చేసాయి. తెలుగులో దేవర, పెద్ది చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్ కోలీవుడ్ లో అడుగుపెడుతుంది అనే టాక్ వినిపించింది.

కానీ జాన్వీ కపూర్ కోలీవుడ్ వైపు అస్సలు చూడలేదు. ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇచ్చిన షాక్ తో తమిళనాట అడుగుపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఇకపై ఆమె వరసగా సౌత్ సినిమాలు ఎంచుకుంటుంది, అదే ఊపులో జాన్వీ కపూర్ కొలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అని తెలుస్తుంది. డైరెక్టర్ సర్గుణం జాన్వీని తమిళ ఆడియన్స్ కి కపరిచయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే జాన్వీ కపూర్ సినిమాతో కాదు వెబ్ సీరీస్ తో కోలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కురత్తి అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సీరీస్ లో జాన్వీ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ దర్శకుడు పా.రంజితికి చెందిన నీలం ప్రొడక్షన్స్ నిర్మించనుందట.

 

Janhvi Kapoor to Enter Kollywood with Web Series