ఆ తేదీపై నిఖిల్ స్వయంభు కన్ను

Nikhil Swayambhu eyes on this dateNikhil Swayambhu eyes on this date


యువ హీరో నిఖిల్ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం స్వయంభు విడుదల విషయంలో జరుగుతున్న నాటకీయపరిణామాలు.. సినిమాపై ఎక్కడ హైప్ తగ్గిస్తాయో అని నిఖిల్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. స్వయంభు ఓటీటీ డీల్ తెగకపోవడంతో ఆ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ లాక్ చేయలేకపోతున్నారు నిర్మాతలు.

అయితే ఆగష్టు లో స్వయంభు ఉండొచ్చనే ప్రచారం జరిగినా తాజాగా స్వయంభు సెప్టెంబర్ 3 పై కన్నేసింది, సెప్టెంబర్ 3 స్వయంభు విడుదల ఉండొచ్చు, మేకర్స్ ఆ డేట్ పై ఆలోచనలో ఉన్నారు, త్వరలోనే సెప్టెంబర్ 3 స్వయంభు పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల చేసేలా మేకర్స్ ప్రకటిస్తారని తెలుస్తుంది.  

మరి ఇప్పటికైనా స్వయంభు బయటికొస్తుందా, లేదంటే మళ్లీ ఈ డేట్ కూడా రూమర్ గానే మిగిలిపోతుందా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా కనిపిస్తుంది. చూద్దాం నిఖిల్ సినిమాకి మోక్షం ఎప్పుడో అనేది.
 

Nikhil's Swayambhu Eyes September 3 Release?