బ్లాస్ట్ ఓటీటీ పబ్లిక్ టాక్
Blast Zone OTT Talk
సీనియర్ హీరో అర్జున్, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాస్ట్ చిత్రం తమిళనాట థియేటర్స్ లో హిట్ అయ్యింది, తెలుగులోనూ బ్లాస్ట్ జోన్ గా విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ రాలేదు. తెలుగులో బ్లాస్ట్ ని బాగా ప్రమోట్ చేసి ఉంటె ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి హిట్ అయ్యేది.
ఇప్పుడు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ నెల 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని చూసి ఆడియన్స్ వావ్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యామో అంటూ మాట్లాడుకుంటున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కరాటే మాస్టర్ గా అద్భుతంగా యాక్ట్ చేస్తే ప్రీతి ముకుందన్ ఆయన కూతురుగా అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇచ్చింది.
ఒక చిన్న ఫ్యామిలీ.. కరాటే ఫ్యామిలీ తమని తాము రక్షించుకోవడమే కాదు.. సమస్యల్లో ఉన్న ప్రతి ఒకరిని ఆదుకుంటుంది. అంతే కాదు అసలు వారికి పరిచయం లేని ఊరి కోసం అర్జున్ ఫ్యామిలీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొని పోరాటం చేసింది అనే సింపుల్ లైన్ ని కరాటే తో ఎలా చూపించాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారు.
బ్లాస్ట్ కథా నేపథ్యం, BGM, అర్జున్, ప్రీతి ముకుందన్ నటన, సినిమాటోగ్రఫీ అన్ని బ్లాస్ట్ చిత్రానికి ప్లస్ లుగా నిలిచాయి. థియేటర్స్ లో మిస్ అయిన వారు నెట్ ఫ్లిక్స్ లో బ్లాస్ట్ ని మిస్ అవ్వకుండా వీక్షించేయ్యండి.







































