Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Karnataka CM Siddaramaiah announces resignation

కర్ణాటకలో రసవత్తర రాజకీయం

Karnataka CM Siddaramaiah announces resignation

 

కర్ణాటక లో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతున్నప్పటికీ సీఎం కుర్చీ కోసం నిత్యం సిద్ధరామయ్య vs శివ కుమార్ లు అన్నట్టుగా అక్కడ రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే సిద్దరామయ్య రెండున్నరేళ్లు, డీకే శివ కుమార రెండున్నరేళ్లు సీఎం గా ఉంటారని ప్రచారం జరిగింది.

మొదట్లో సీఎం సీటు కోసం శివ కుమార్, సిద్దరామయ్యలు తీవంగా ప్రయత్నం చెయ్యగా.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్దరామయ్య కి సీఎం కుర్చీ కట్టబెట్టింది. అది కూడా రెండున్నరేళ్లు మాత్రమే అన్నారు.

అనుకున్నట్టుగానే సిద్దరామయ్య ఈరోజు మే 28 ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి తన ఇంట్లోనే మంత్రులు, ఎమ్యెల్యేలకు బ్రేక్ ఫాస్ట్ విందు ఏర్పాటు చేసారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో డీకే శివ కుమార్ సిద్దరామయ్యను ఆలింగనం చేసుకుని కాళ్లకు నమస్కరించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి తనకు లోపల ఎలాంటి బాధ లేదని చెప్పిన సిద్ధరామయ్య తనకు ఇంత కాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే శివకుమార్ కు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. దానితో కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివ కుమార్ కి అడ్డంకులు తొలిగిపోయి బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనం కానుంది.

 

 

DK Shivakumar is the CM 100%