విజయ్ ఇల్లు ఖాళీ చెయ్యాలి - ప్రజల డిమాండ్

తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చెయ్యడమే కాదు తమిళనాడు అసెంబ్లీ లో తన పార్టీ తో బలం నిరూపించుకుని సీఎం కుర్చీ ని అధిరోహించారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన క్షణమే బెల్ట్ షాప్ లపై విజయ్ ఉక్కు పాదం మోపారు. అయితే సీఎం గా ప్రజలకు దగ్గరవుతున్న విజయ్ కి ప్రజల నుంచి సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
అది విజయ్ ఇప్పుడు ఉంటున్న ఇంటిని ఖాళీ చెయ్యాలని చెన్నై ప్రజలు గోల పెడుతున్నారు. సీఎం గా విజయ్ తన సొంత ఇంటి నుంచి అసెంబ్లీ కి వెళ్ళాలి అంటే 18 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 18 కిలోమీటర్లు విజయ్ కాన్వాయ్ వస్తుంటే ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
అందుకే విజయ్ ఇప్పుడు ఉంటున్న ఇంటిని ఖాళీ చెయ్యాలనే డిమాండ్ మొదలైంది. అసెంబ్లీ కి దగ్గరగా విజయ్ నివాసం ఏర్పరుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై విజయ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.
CM VijayTamil Nadu CM Vijay






































