అస్సలు బజ్ కనిపించని సూర్య వీరభద్రుడు

ఈమధ్యన కోలీవుడ్ సూర్య సినిమాలు వరసగా నిరాశపరుస్తున్నాయి. ఓటీటీ రిలీజ్ ల తర్వాత ఆయన నుంచి ఏ థియేట్రికల్ మూవీ ఆడియన్స్ ను మెప్పించలేదు. సూర్య గత సినిమా రెట్రో కూడా బాగా డిజప్పాయింట్ చేసింది. అందుకే ఈమధ్యన సూర్య సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు రెండు కనిపించడం లేదు.
రేపు మే 14 న తమిళ కరుప్పు, తెలుగు వీరభద్రుడు పై ట్రేడ్ లో ఎలాంటి బజ్ కనిపించడం లేదు. ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో సూర్య-త్రిష జంటగా నటించిన వీరభద్రుడు చిత్రం మంచి ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. కానీ ఆడియన్స్ లో ఈ చిత్రంపైన ఎంత ఇంట్రెస్ట్ ఉందొ క్లారిటీ లేదు.
అటు చూస్తే బుకింగ్స్ వీక్ గా వున్నాయి. వీరభద్రుడు సినిమా చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని అనిపిస్తుంది. మరి సూర్య కరుప్పు సినిమాకి ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
Suriya Karuppu titled VeerabhadruduSuriya at Veerabhadrudu Movie Promotions








































