గ్లోబల్ బ్యూటీ సిటీలో లగ్లరీ ప్లాట్ కొంటుందా

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సరసన `వారణాసి` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో ఎంటర్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అమ్మడు హైదరాబాద్‌లో ఖరీదైన ప్లాట్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. షూటింగ్ నిమిత్తం తరచుగా ఇక్కడకు రావలసి ఉండటంతో? హోటల్ బస కంటే సొంత ఇల్లు ఉంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారట. ప్రియాంక ఇప్పటికే ముంబైలోని పాత ఆస్తులను విక్రయించి ఆ నిధులను ఇతర ప్రాంతాలలో పెట్టుబడులుగా మలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లేదా హైటెక్ సిటీకి సమీపంలోని ప్రైమ్ ఏరియాల్లో లగ్జరీ ప్రాపర్టీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుండటం, ఇక్కడి నిర్మాతలు భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తుండటంతో, ప్రియాంక ఇక్కడా బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం వ్యూహాత్మకంగా ఆమెకు కలిసొచ్చే అంశం. గ్లోబల్ బ్యూటీ హైదరాబాద్‌లో ప్లాట్ కొంటుందనే వార్త మెగా సూపర్ స్టార్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.








































