కోర్టుకు సింగర్ మంగ్లీ

సింగర్ మంగ్లీ ఈమధ్యన మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. మంగ్లీ , ఆమె తమ్ముడు, రామావత్ మధు లు ప్రజలను మోసగించారంటూ లాయర్ సుబ్బారావు వేసిన కేసు విషయంలో మంగ్లీ ఎప్పటికప్పుడు తనకు ఈ కేసుతో సంబంధం లేదు అంటూ మీడియా మూడు వాదిస్తుంది. కానీ మంగ్లీ విషయంలో మీడియా పోలీసుల కన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
ఇలాంటి సమయంలో మంగ్లీ తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్ట్ ఆశ్రయించింది.. తన పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టులో పిటిషన్, రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి లతో పాటు పలు మీడియా సంస్థలకు.. డిజిటల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
తనకు సంబంధం లేని మైక్రో ఫైనాన్స్ వివాదంలో తనపై అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు, తన పరువు కి నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశారంటూ మంగ్లీ కోర్టుకు వెళ్ళింది. ముందస్తు ప్రాణాలికలతో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని, ఆ నెగెటివ్ వార్తల వల్ల ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయని.. సోషల్ మీడియాలో ఆయా లింకులను వెంటనే తొలగించాలని.. భవిష్యత్తులో తనపై అసత్య ప్రచారం చేయకుండా నిరోధించాలని కోర్టును కోరింది మంగ్లీ..
దానితో పలు మీడియా సంస్థలతోపాటు.. యూట్యూబ్ ఛానల్స్, రామావత్ మధు, సుబ్బారావు హేమాకాంత్ రెడ్డి లకు నోటీసులు జారీ చేసింది సిటీ సివిల్ కోర్ట్..!






































