రెండు చోట్ల విక్టరీ తో విజయ్

Vijay with victory in two placesVijay with victory in two places

తమిళనాట పోటీ చేసిన రెండు స్థానాల్లో టీవీకే విజయ్ విక్టరీ సాధించారు. రెండేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చి ఏడాదిన్నర క్రితం పార్టీ పెట్టి ప్రజలోకి వెళ్లిన విజయ్ ను అదృష్టం వరించింది. విజయ్ పార్టీ అటు ఇటూగా 108 స్థానాలను కైవసం చేసుకుని విజయం దిశగా పరుగులు పెడుతుంది. ఊహించని విజయం విజయ్ సొంతమయ్యింది. ఎవరూ విజయ్ తమిళనాట ఈ ఎన్నికల్లో గెలుస్తాడని అనుకోలేదు. మహా అయితే 15 నుంచి 25 స్థానాలు గెలుస్తారని అంచనా వేశారు.
ఎవ్వరి ఊహలకు అందని విక్టరీని సొంతం చేసుకోవడమే కాదు విజయ్ పోటీ చేసిన పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ రెండు చోట్లా విజయ్ భారీ మెజారిటీ తో విజయాన్ని సొంతం చేసుకున్నారు. తిరుచ్చి ఈస్ట్ లో 20వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విజయ్ ..పెరంబూరులో డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ పై 40 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 
మ్యాజిక్ ఫిగర్ ని కొద్ధి దూరంలో మిస్ అయిన విజయ్ సీఎం గా అధికారాన్ని మాత్రం చేపడతారు. 10 మంది అభ్యర్థులు విజయ్ పార్టీ కి కావాల్సి వస్తారు. మరి విజయ్ ఎటు వైపు అడుగులు వేసి అధికారాన్ని సొంతం చేసుకుని సీఎం కుర్చీని అధిష్టిస్తారో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.

Tamil Nadu Assembly Election Results 2026