ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Reliance Retail acquires Priyanka Chopra Anomaly haircare brand

ప్రియాంక చోప్రాతో గ్లోబల్ రేంజ్ బిజినెస్

Reliance Retail acquires Priyanka Chopra  Anomaly haircare brandReliance Retail acquires Priyanka Chopra Anomaly haircare brand

ప్రియాంక చోప్రా స్థాపించిన `అనోమలీ` హెయిర్ కేర్ బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో బ్రాండ్ ఆస్తులు- మేధో సంపత్తిపై రిలయన్స్‌కు పూర్తి హక్కులు వచ్చాయి. 2021లో మొదలైన ఈ బ్రాండ్ వీగన్ ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తూ గుర్తింపు పొందింది. రిలయన్స్ తన `టిరా` ప్లాట్‌ఫారమ్ ద్వారా దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. ముఖ్యంగా భారతీయుల‌ హెయిర్ స్వభావానికి తగ్గట్లుగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే రిలయన్స్ ప్రధాన లక్ష్యం.
రిలయన్స్ అండతో ఈ బ్రాండ్ అమెరికా, బ్రిటన్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరింతగా విస్తరించనుంది. అంతేకాదు.. బ్రాండ్‌ను విక్రయించినా ప్రియాంక చోప్రా `క్రియేటివ్ డైరెక్టర్`గా తన సేవలను అందిస్తారు. ఉత్పత్తుల నాణ్యత .. బ్రాండ్ విజన్‌ను  స్వయంగా పర్యవేక్షిస్తారు. ఇషా అంబానీ సారధ్యంలో అనోమలీ బ్రాండ్‌ను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లాలని రిలయన్స్ పక్కా ప్లాన్ వేసింది. ఈ డీల్ బ్యూటీ మార్కెట్‌లో రిలయన్స్ ఆధిపత్యాన్ని మరింత పెంచనుంది.

Priyanka Chopra