ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhagyashri Borse in Sivakarthikeyan Seyon

ఆ హీరోతో ఛాన్స్ అమ్మ‌డికి నెక్స్ట్ లెవ‌ల్ ఎంట్రీ!

Bhagyashri Borse in Sivakarthikeyan SeyonBhagyashri Borse in Sivakarthikeyan Seyon


`మిస్టర్ బచ్చన్` తో వెండితెరపై మెరిసిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా  ఈ మరాఠీ ముద్దుగుమ్మ  కోలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన `సేయోన్` అనే భారీ ప్రాజెక్టులో కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.  సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌గా  ఈ చిత్రాన్ని రవికుమార్  తీర్చి దిద్ద‌తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే  మొదటి సినిమా విడుదల కాకముందే? టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజాగా శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరో సినిమాతో ఛాన్స్ రావడం అమ్మ‌డి కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుంద‌ని చెప్పొచ్చు. ఈ చిత్రంలో భాగ్య  పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని  గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా నటనకు కూడా ఆస్కారం ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో న‌టిగా తనదైన ముద్ర వేసింది.
కానీ వైఫ‌ల్యాలే ఇబ్బంది పెడుతున్నాయి. లేదంటే? అమ్మ‌డు పాన్ ఇండియా చిత్రాల‌కే ప్ర‌మోట్ అయ్యేది. అయినా రీజ‌న‌ల్ మార్కెట్లో మంచి అవ‌కాశాలే అందుకుంటోంది.
ప్రస్తుతం  తమిళ చిత్ర పరిశ్రమలో శివకార్తికేయన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయనతో కలిసి నటించడం అంటే ఏ హీరోయిన్‌కైనా లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి చాలా మంది భామ‌ల్ని ప‌రిశీలించి చివ‌రిగా ఆ ఛాన్స్ భాగ్య‌కిచ్చిన‌ట్లు తెలుస్తోంది. మరి ఈ మెరుపుతీగ భాగ్యశ్రీ కోలీవుడ్ ఎంట్రీతో అక్కడ కూడా త‌న‌దైన ముద్ర వేసి ప్ర‌యాణం సాగిస్తుందో?  లేదో చూడాలి.

Bhagyashri Borse