యాక్టింగ్ ని వదిలేస్తున్న దగ్గుబాటి హీరో

Daggubati hero quitting actingDaggubati hero quitting acting

కొన్నాళ్లుగా హీరో దగ్గుబాటి రానా సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు. నేనే రాజు నేనే మంత్రి, విరాట పర్వం, బాహుబలి భళ్లాలదేవుడిగా పాన్ ఇండియా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన రానా కొన్నాళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చాడు. మధ్యలో ఓ టాక్ షో చేసిన రానా అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తున్నాడు.

నిర్మాతగా సినిమాలు చేస్తున్న రానా నటనకు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఆయన హెల్త్ ఇస్యూస్. ఒకొనొక సమయంలో కిడ్నీ ప్రాబ్లెమ్ తో రానా అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని వచ్చారు. ఆ సమయంలో నటన, సినిమాలు, పేరు ఇవేమి గుర్తురాలేదు, కేవలం బ్రతికుంటే చాలని భయపడినట్లుగా రానా ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూ లో రివీల్ చేసారు. అంతేకాకుండా ఈమధ్యన రానా బాగా చిక్కిపోయి కనిపించడం  కలిగిస్తుంది. రీసెంట్ గా ఆయన కనిపించిన తీరుకి అభిమానులు షాకవుతున్నారు.

అయితే రానా దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చినా అనారోగ్య కారణాలతో తను వదులుకున్నట్టుగా చెప్పిన రానా ఇకపై నటనకు దూరంగా ఉంటారా, కేవలం నిర్మాతగానే కొనసాగుతారా అనే వార్తలు దగ్గుబాటి అభిమానులు ఆందోళన పెడుతున్నాయి. మంచి నటుడు రానా ని మిస్ అవుతామని కామన్ ఆడియన్స్ కూడా ఫీలైపోతున్నారు. మరి రానా ఈ న్యూస్ లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Did Rana Daggubati quit Acting?

rana