హిట్ అయినా సౌండ్ లేదు

Couple Friendly movie Public TalkCouple Friendly movie Public Talk

సంతోష్ శోభన్ - మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లి నిన్న శనివారం మహాశివరాత్రి స్పెషల్ గా విడుదలైంది. సినిమాకి ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సంతోష్ శోభన్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్పెషల్ గా హీరోయిన్ మానస వారణాసి అందరికి నచ్చేసింది. 

కపుల్ ఫ్రెండ్లీ కి క్రిటిక్స్ నుంచి కూడా పాస్ మార్కులు పడిపోయాయి, రివ్యూ రైటర్స్ కూడా కపుల్ ఫ్రెండ్లీ బావుంది అన్నారు, కానీ ఈ సినిమాకి థియేటర్స్ లో మాత్రం సౌండ్ లేదు. పెద్ద బ్యానర్ యువి క్రియేషన్స్ నుంచి వచ్చింది, మంచి ప్రమోషన్స్ ఉన్నాయి, అయినా థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించడం లేదు. 

కారణం చిన్న సినిమా అనా, లేదంటే మూడు వారాలు తిరిగేలోపు ఓటీటీ లో చూడొచ్చనా, ఏది ఏమైనా హిట్ సినిమాకి సౌండ్ లేకుండా పోయింది. ఈ వారం విడుదలైన సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లి తప్ప మరే సినిమా వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ కుర్ర హీరో సంతోష్ శోభన్ తన హీరోయిన్ మానస ను వెంటేసుకుని కపుల్ ఫ్రెండ్లి థియేట్రికల్ టూర్ లాంటివి చేస్తే సినిమాకి మంచి డబ్బులొస్తాయి. 

లేదంటే హిట్ సినిమా ని చేతులారా చంపుకోవాలి. ప్రస్తుతం కపుల్ ఫ్రెండ్లి సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. 

Couple Friendly Social Media talk

couple friendly