వారణాసి - హైదరాబాద్ టు జార్జియా

Varanasi Shooting update Varanasi Shooting update

సూపర్ స్టార్ మహేష్ తో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ వారణాసి. ఈ చిత్రం పై హాలీవుడ్ లోను అంచనాలు పెరిగేలా రాజమౌళి వేస్తున్న స్టెప్స్ మహేష్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా ఏడాది సమయముండగానే రాజమౌళి తన టీమ్ మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ లతో ఇప్పించిన ఇంటర్వ్యూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో వారణాసి బిగ్ షెడ్యూల్ పూర్తి కాగా.. టీమ్ మొత్తం ఇప్పుడు జార్జియాకు పయనమవుతుంది. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే జార్జియా షెడ్యూల్‌లో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక, పృథ్వీరాజ్, ఇంకా కీ రోల్స్ చేస్తున్న వారిపై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 

ఇక చిత్రంలో ప్రధానమైన రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని రాజమౌళి ప్రకటించడం ఆసక్తిని పెంచింది. మహేష్ రుద్ర గా పలు పాత్రల్లో వారణాసిలో మెస్మరైజ్ చెయ్యనున్నారు. ఈ చిత్రంలో ఏప్రిల్ 7, 2027 న రిలీజ్ కాబోతుంది. 

Varanasi movie update

varanasi