దట్ ఈజ్ సూపర్ స్టార్
Rajinikanth on Tuesday felicitated Padmaరీసెంట్ గా తమిళనాడు లోని చెన్నై లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. రోడ్లు క్లీన్ చేసుకునే పద్మ అనే పారిశుధ్య కార్మికురాలు చేసిన ఓ గొప్ప పనిని సూపర్ స్టార్ రజినీకాంత్ మెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తను రోడ్ క్లీన్ చేస్తున్న సందర్భంలో రోడ్డుపై పడి ఉన్న 45 సవర్ల బంగారు ఆభరణాలను తీసుకుని ఆమె వాటిని పోలీసులకు అప్పగించింది.
ఆ బంగారానికి యజమాని ఎవరో కనుక్కుని పోలీసులు వారికి అప్పగించిచిన ఘటన సంచలనం సృష్టించగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ పారిశుధ్య కార్మికురాలు పద్మ ను తన ఇంటికి స్వయంగా పిలిపించుకుని శాలువా కప్పి ప్రసంశించడమే కాదు ఆమెకు బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు.
ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు రియాక్ట్ అవుతూ.. దట్ ఈజ్ సూపర్ స్టార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Rajinikanth has invited a sanitation employee named Padma to his Chennai House






































