ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Manoj heads to IMAX to watch Kannappa

కన్నప్ప కోసం ఐమాక్స్ కి మంచు మనోజ్

కన్నప్ప చిత్రాన్ని వీక్షించేందుకు మంచు మనోజ్ హైదరాబాద్ లోని ఐమాక్స్ కు రావడం హాట్ టాపిక్ అయ్యింది. అన్న మంచు విష్ణు నే కాదు ఆయన తెరకెక్కించిన కన్నప్ప పై వెటకారపు కామెంట్లు పెట్టిన మంచు మనోజ్ సినిమా విడుదల రోజు సినిమా చూసేందుకు ఇలా రావడం నిజంగా షాకిచ్చే విషయమే. 

కన్నప్ప దొంగప్పా, శివయ్యా అనిపిలిస్తే శివుడు రాడు, కన్నప్ప కోసం కోట్లు ఎక్కడినుంచి తెచ్చారు, MBU యూనివర్సిటీలో విష్ణు ఫ్రాడ్ చేసి కన్నప్ప కి బడ్జెట్ పెట్టాడు అంటూ మంచు మనోజ్ గతంలో మంచు విష్ణు కన్నప్ప పై బోలేడన్ని కామెంట్లు చెయ్యడమే కాదు, కన్నప్ప చిత్రంతో తను నటించిన భైరవం చిత్రాన్ని పోటీకి దించుతా అంటూ ఛాలెంజ్ చేసాడు. కానీ అది కుదరలేదు. 

ఈరోజు విడుదలవుతున్న కన్నప్ప టీమ్ కి మంచు మనోజ్ పేరు పేరునా బెస్ట్ విషెస్ తెలియజేసాడు. అన్న విష్ణు పేరు ఎక్కడా ఎత్తకుండా తండ్రి మోహన్ బాబు, విష్ణు కుమార్తెలు అరియనా, విరియానా, కొడుకు అవ్రామ్‌‌ ఇలా పేరు పేరునా పలికిన మనోజ్, విష్ణు పేరు మాత్రం పలకలేదు. ఇక ఈరోజు కన్నప్ప చిత్రాన్నిఐమ్యాక్స్ లో చూసేందుకు మంచు మనోజ్ రావడంతో అందరూ మనోజ్ ఫొటోస్, వీడియోస్ తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.  

అది చూసి అన్న కన్నప్ప చిత్రాన్ని వీక్షించి కౌంటర్లు వేసేందుకే మంచు మనోజ్ కన్నప్ప ని చూసేందుకు ఐమాక్స్ కు వచ్చాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Manoj Manchu was spotted at Prasads IMAX to watch Kannappa show

Manchu Manoj heads to IMAX to watch Kannappa
manoj manchu