Advertisement

అప్పుడు కింగ్ డమ్ ఇప్పుడు లెనిన్

Then the Kingdom, now Lenin

విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో అనౌన్స్ చేసిన కింగ్ డమ్ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ను అనుకోవడమే కాదు ఆమె పేరుని కింగ్ డమ్ హీరోయిన్ గా మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ శ్రీలీల వరస డిజాస్టర్స్ తో ఉన్నందున ఆమెను కింగ్ డమ్ నుంచి తప్పించి ఆమె ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అలా శ్రీలీల ఛాన్స్ భాగ్యశ్రీని వరించింది. 

ఇపుడు అఖిల్ లెనిన్ చిత్రంలో శ్రీలీల ని హీరోయిన్ గా ఎంపిక చెయ్యడమే కాదు.. అఖిల్ బర్త్ డే కి వదిలిన లెనిన్ గ్లింప్స్ లో శ్రీలీల కు ఛాన్స్ ఇచ్చారు, అంతేకాదు శ్రీలీల బర్త్ డే కి లెనిన్ నుంచి ఆమె ఫస్ట్ లుక్ వదిలారు. కట్ చేస్తే శ్రీలీల లెనిన్ మేకర్స్ కి డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కారణంగా ఆమెను లెనిన్ నుంచి తప్పించారు. 

అలా మరోసారి శ్రీలీల ఛాన్స్ ను భాగ్యశ్రీ బోర్సే అందుకుంది. ఇప్పుడు లెనిన్ చిత్రం నుంచి శ్రీలీల అవుట్, భాగ్యశ్రీ విన్ అన్నమాట. అలా భాగ్యశ్రీ బోర్సే అప్పట్లో శ్రీలీల కింగ్ డమ్ ని ఎగరేసుకుపోగా. ఇప్పుడు అదే శ్రీలీల లెనిన్ చిత్రాన్ని మరోసారి భాగ్యశ్రీ బోర్సే తన్నుకుపోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

Bhagyashri Borse Replaces Sreeleela In Lenin

bhagyashri borse