Advertisement

హోంబాలే ఫిల్మ్స్ బిగ్ స్కెచ్

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాల‌తో భార‌త‌దేశంలో అత్యుత్త‌మ ట్రాక్ రికార్డ్ ని న‌మోదు చేసిన బ్యాన‌ర్ హోంబాలే ఫిల్మ్స్. ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్ తో క‌లిసి ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ఫ్రాంచైజీ, మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ కోసం భారీ లైనప్‌ను రూపొందించి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ సినిమాల టైటిల్స్ ని తాజాగా అధికారికంగా ఈ సంస్థ‌లు ఆవిష్కరించాయి. ఒక దశాబ్దం పాటు సాగే ఈ సిరీస్ 2025లో `మహావతార్ నరసింహ`తో ప్రారంభమై 2037లో `మహావతార్ కల్కి పార్ట్ 2`తో ముగుస్తుంది. మ‌హా విష్ణువు పది దివ్య అవతారాలను ఆవిష్క‌రించే యానిమేటెడ్ సిరీస్ ల‌ ఫ్రాంఛైజీ ఇది.

మహావతార్ సినిమా యూనివర్స్ నుంచి ఏ సినిమా ఏ సంవ‌త్స‌రం విడుద‌ల‌వుతుందో తేదీలు కూడా హోంబ‌లే ఫిలింస్ అధికారికంగా క్యాలెండ‌ర్ ని రిలీజ్ చేసింది. రిలీజ్ క్యాలెండర్ వివ‌రాల ప్ర‌కారం...1. మహావతార్ నర్సింహ (2025), 2. మహావతార్ పరశురామ్ (2027), 3. మహావతార్ రఘునందన్ (2029), 4. మహావతార్ ద్వారకాధీష్ (2031), 5. మహావతార్ గోకులానంద (2033), 6. మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), 7. మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) చిత్రాలు ఈ సిరీస్ లో తెర‌కెక్కుతున్నాయి. 

ఇక మహావతార్ విశ్వం కి అశ్విన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హోంబ‌లే కిరంగ‌దూర్ తో క‌లిసి శిల్పా ధావన్ ఈ సిరీస్ సినిమాల‌ను నిర్మిస్తున్నారు. మహావతార్‌తో, విష్ణువు పవిత్ర అవతారాలను ఉత్కంఠభరితమైన యానిమేషన్ ద్వారా జీవం పోసే సినిమాటిక్ విశ్వాన్ని ప్రదర్శించడానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని హోంబ‌లే ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

Hombale Films Announced Massive Lineup For The Next Ten Years

Hombale Films MCU
hombale films