Advertisement

సేల్స్ గ‌ర్ల్ వెయిట్రెస్ గా ప‌ని చేసిన న‌టి

ఈ న‌టి ఒక‌ప్పుడు షాపింగ్ మాల్ లో సేల్స్ గ‌ర్ల్ గా ప‌ని చేసింది. లాట‌రీ టికెట్లు అమ్మింది. రెస్టారెంట్ వెయిట్రెస్ గా.. బార్ లో ఫుడ్ స‌ర్వీస్ చేసే అమ్మాయిగా.. బ‌తుకు తెరువు కోసం చిన్నా చిత‌కా చాలా ఉద్యోగాలు చేసింది. చివ‌రికి సెక్యూరిటీగా కూడా ప‌ని చేసింది. 16 వ‌య‌సుకే కుటుంబ ఆర్థిక భారాన్ని మోసింది. కానీ విధి ఎవ‌రిని ఎక్క‌డ ఉంచుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. త‌న‌లో ఉన్న డ్యాన్సింగ్ ట్యాలెంట్ అందం చందం కొన్నేళ్ల క్రితం న‌ట‌నా రంగంలోకి తెచ్చింది.

 

అనూహ్యంగా భార‌తీయ బుల్లితెర‌పై ఓ వెలుగు వెలిగే అవ‌కాశం క‌ల్పించింది ఈ డ్యాన్సింగ్ ప్ర‌తిభ‌. హిందీ బుల్లితెర‌పై తొలుత పాపుల‌రై, అటుపై కొన్ని హిందీ సినిమాల్లో ఐట‌మ్ గర్ల్ గా అవ‌కాశాలు అందుకుంది. సినిమాల్లోను అవ‌కాశాలొచ్చాయి. అదే స‌మ‌యంలో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి బాహుబ‌లిలో మ‌నోహ‌రి పాట‌కు ఎంపిక చేసుకోవ‌డం త‌న ద‌శ‌దిశ‌ను మార్చేసింది. ఈ భామ మ‌రెవ‌రో కాదు... ఇండ‌స్ట్రీ బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్ నోరా ఫ‌తేహి. ప్రభాస్ తో మ‌నోహ‌రి గీతంలో ఈ భామ మ‌త్తెక్కించే నృత్యాలతో అల‌రించింది. ఆ త‌ర్వాత కూడా టాలీవుడ్ లో సౌత్ సినిమాల్లో చాలా ప్ర‌త్యేక గీతాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం బుల్లితెర రియాలిటీ షోల హోస్ట్ గా భారీగా ఆర్జిస్తోంది. అదే స‌మ‌యంలో సినిమాల‌తోను బిజీగా ఉంది.

 

ఇక నోరా ఫ‌తేహిలోని ఫ్యాష‌న్ సెన్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ బ్యూటీ ఎంపిక చేసుకునే దుస్తులు, స్టైల్ కంటెంట్ ఎప్పుడూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇటీవ‌ల కొద్దిరోజులుగా ప్యారిస్ ఫ్యాష‌న్ వీక్ 2025 ఉత్స‌వాల్లో నోరా రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో నోరా స్ట‌న్నింగ్ వైట్ ట్రెంచ్ కోట్ తో క‌నిపించింది. ప్యారిస్ వీక్ లో వ‌ర‌సగా చాలా లుక్స్ ని షేర్ చేసినా ఇది ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. నోరా బ్లాక్ క‌ల‌ర్ గాగుల్స్ కూడా ధ‌రించి ఎంతో అందంగా క‌నిపించింది. ఇక ఆ థై స్లిట్ ఎలివేష‌న్ తో ఎంపిక చేసుకున్న ట్రెంచ్ కోట్ ఆక‌ట్టుకుంటోంది.

Nora Fatehi brings glamour to Paris

nora fatehi worked as waitress
nora fatehi