Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Coolie To Releases As Majdoor In Hindi

రజిని కూలికి అదే ఎఫెక్ట్

లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ కలయికలో కూలి. కూలి టైటిల్ అనౌన్సమెంట్ నుంచే భారీ అంచనాలు దాని చుట్టూ అల్లుకున్నాయి. కూలి చిత్రంలో కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర కూలి లో భాగమవడం ఈప్రాజెక్టు పై మరిన్ని అంచనాలు పెంచేసింది. కూలి కి సంబందించిన ఏ చిన్న వార్త అయినా.. క్షణాల్లో వైరల్ అవుతుంది. 

పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కిన కూలి చిత్రం పిక్స్ కానీ, పోస్టర్స కాని, టీజర్ అన్ని సినిమాపై పాన్ ఇండియా లెవల్లో అంచనాలు పెంచగా.. ఇప్పుడు హిందీ కూలి టైటిల్ సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేసింది. ప్రతి భాషలో కూలి అనే టైటిల్ పై పెరిగిన అంచనాలు మేకర్స్ టైటిల్ మార్చడం ద్వారా తగ్గించేసారా అనేల కూలి చిత్ర టైటిల్ ని హిందీ కోసం మజ్దూర్ గా మార్చడం సినిమాకి ఎఫెక్ట్ కి అయ్యేలా ఉంది. 

అయితే హిందీ కూలి టైటిల్ ని మార్చడం వెనుక రీజన్ కాపీ రైట్స్ సమస్య అని తెలుస్తుంది. అందువలనే కూలిని మజ్దూర్ గా మార్చాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. కూలి టైటిల్ పై ఉన్న హైప్, చప్పగా ఉన్న మజ్దూర్ పై రాదని అంటున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే కూలి టైటిల్ ని మజ్దూర్ గా మార్చడం తో డిజప్పాయింట్ అవుతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు.

Rajinikanth Coolie To Releases As Majdoor In Hindi

Coolie To Releases As Majdoor In Hindi
rajinikanth