ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Will Kannappa continue the success of Kuberaa?

కుబేర సక్సెస్ ని కన్నప్ప కంటిన్యూ చేస్తుందా

ఈ నెలలో పాన్ ఇండియా మూవీగా, భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన కుబేర జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చి విడుదలైన అన్ని లాంగ్వేజెస్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా యునానమస్ గా కుబేర కు సూపర్ హిట్ మార్కులు వెయ్యడం, టికెట్ బుకింగ్స్ అదిరిపోవడం అన్ని చూస్తే సినిమా ఎలా ఉందొ స్పష్టమవుతుంది. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ బిచ్చగాడిగా అద్దరగొట్టిన కుబేర చిత్రానికి అన్ని వైపులా నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో కుబేర బాక్సాఫీసు దగ్గర పాసైపోయింది. మరి కుబేర సంగతి ఓకె కానీ కన్నప్ప సంగతేమిటి, కన్నప్ప మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 27 న విడుదల కాబోతుంది. 

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లు కన్నప్ప లో గెస్ట్ పాత్రల్లో కనిపించడంతో సినిమాపై భారీ హైప్ ఉంది. క్రేజీ ప్రమోషన్స్ తో జూన్ 27 న వస్తోంది. కన్నప్ప పాన్ ఇండియా లో ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

మరి కుబేర బాక్సాఫీసు దగ్గర కళకళలాడింది, కన్నప్ప దాన్ని కంటిన్యూ చెయ్యాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 

Kannappa release on June 27th

Will Kannappa continue the success of Kuberaa?
kannappa