ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan Reveals His Favourite Role

పవన్ కిష్టమైన పాత్ర-ప్రేక్షకులకు నచ్చదు

హీరో కమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకిష్టమైన పాత్ర పై చేసిన కామెంట్స్ నెట్టింట్లో సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో ఎన్నో పాత్రలు వేశారు. కాని అవన్నీ ఆయనకు అంతగా ఇష్టం లేదట. ఆ పాత్రల్లో కొన్ని లక్షణాలు మాత్రమే పవన్ కి నచ్చాయట. 

తాజాగా పవన్ కళ్యాణ్ మట్లాడుతూ.. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రల్లో ఏది నా మనసుకు చేరువైన పాత్ర లేదు, ఆ పాత్రల్లో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. కానీ పూర్తిస్థాయిలో నాకు ఆ పాత్రలు చేరువ కాలేదు. నేను రియల్ గా ఎలా ఉంటానో, అలానే ఒక సినిమాలో నటించాలని ఉంది. 

కానీ నేను అలా రియల్ లైఫ్ పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు, అసలు అది సినిమాల్లో వర్కౌట్ కాకపోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ తనకిష్టమైన పాత్ర ఎలా ఉండాలనుకున్నారో రివీల్ చేసారు. 

Pawan Kalyan

Pawan Kalyan Reveals His Favourite Role
pawan kalyan