కన్నప్ప కి అదే అసంతృప్తి

Kannappa promotionKannappa promotion

కన్నప్పలో పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ నటించారు. ప్రభాస్ నటనపై, ఆయన గొప్పదనం పై మంచు  విష్ణు పదే పదే ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా, ప్రభాస్ ఫ్యాన్స్ మెచ్చేలా మాట్లాడుతున్నారు. రుద్ర కేరెక్టర్ లో ప్రభాస్ లుక్, అలాగే కన్నప్ప ట్రైలర్ లో ప్రభాస్ కేరెక్టర్, డైలాగ్స్  చూసాక అభిమానుల్లో కాన్ఫిడెన్స్ మొదలైంది. కన్నప్పని ప్రభాస్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. 

కన్నప్ప లో ప్రభాస్ ఎంతసేపు కనిపిస్తారనే విషయంలోనూ ఓ స్పష్టత వచ్చింది. మరోపక్క కన్నప్ప లో ప్రభాస్ ఉన్నారు, అలాగే ఆయన కన్నప్ప ప్రమోషన్స్ లోను కనిపిస్తే బావుండేది అంటూ చాలామంది కోరుకున్నారు. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్ కి ప్రభాస్ వస్తారని ఎక్స్పర్ట్ చేసారు. 

కానీ ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు, దానితో ఆయన అభిమానులు చాలా డిజప్పాయయింట్ అయ్యారు. ప్రభాస్ అలా వచ్చి ఇలా వెళ్లినా కన్నప్ప కు ఇంకాస్త క్రేజ్ పెరిగేది అంటూ మాట్లాడుకుంటున్నారు. అదే ఇప్పుడు కన్నప్పకు కాస్త అసంతృప్తిగా మారింది. మంచు విష్ణు ని ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ చెయ్యమని ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు కూడా పెడుతున్నారు. 

Prabhas skips Kannappa Promotional Event

prabhas