Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aamir Khan reveals why his kids were named Junaid, Ira and Azad

పిల్ల‌ల‌ పేర్లలో మ‌త‌ల‌బు.. స్టార్ హీరో మ‌త పిచ్చి?

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హిందువుల‌ను పెళ్లాడినా వార‌సుల‌కు ముస్లిమ్ పేర్ల‌ను పెట్టుకోవ‌డంపై చాలా కాలంగా సోష‌ల్ మీడియాల్లో విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా ఆప్ కి అదాలత్‌లో హోస్ట్ రజత్ శర్మతో చాటింగ్ సెష‌న్ లో దీనిపై అత‌డు క్లారిటీ ఇచ్చాడు.

శ‌ర్మ‌, అమీర్ మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ‌ల్లో.... మీ మొదటి భార్య రీనా.. రెండవ భార్య కిరణ్ అని శర్మ సరదాగా సంభాషించారు.. తదుపరి భార్య `గౌరి` కావచ్చు అని చమత్కరించాడు. ఆ స‌మ‌యంలో అమిర్ ప్రస్తుత భాగస్వామి గౌరీ స్ప్రాట్ గురించి ప్రస్తావిస్తూ కొంత సిగ్గుప‌డుతూ మాట్లాడాడు. అమీర్ త‌న పిల్ల‌ల‌కు త‌ల్లుల మ‌తాల‌కు సంబంధించిన పేరును ఎందుకు పెట్టుకోలేదు? అనే ప్ర‌శ్న ఎదురు కాగా దానికి స్పందించాడు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ... నా పిల్లల పేర్లను పూర్తిగా నా భార్యలు ఎంచుకున్నారు... ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ``మీరు కూడా భర్తే. ఆ బాధ‌ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సాధారణంగా భర్తలు నిర్ణయించుకోలేరు`` అని శ‌ర్మ‌తో స‌ర‌దాగా స్పందించారు. జునైద్, ఇరా పేర్లను ఎంచుకున్నది రీనా. ఇరా అనే పేరు భారతీయ సంప్రదాయంలో లోతైన మూలాలను కలిగి ఉంది. ఇరా అనేది సరస్వతి దేవికి మరొక పేరు. మీరు ఇరావతి గురించి విన్నారా? ఇరా దాని స్మాల్ వెర్షన్. రీనా వాస్తవానికి మేనకా గాంధీ హిందూ పేర్ల పుస్తకంలో ఈ పేరును కనుగొన్నారు.

ఆజాద్ విషయానికొస్తే ఆ పేరును తన రెండవ భార్య కిరణ్ రావు ఎంపిక చేసుకున్నారని అమీర్ తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నివాళిగా ఈ పేర‌ను ఎంచుకున్నామ‌ని ఆమిర్ తెలిపారు. మౌలానా ఆజాద్ మన దేశ స్వేచ్ఛ కోసం అపారమైన త్యాగాలు చేశారు. ఆయన నెహ్రూ, గాంధీ, సర్దార్ పటేల్‌తో భుజం భుజం కలిపి నిలబడ్డారు. ఆయన మ‌న‌కు గొప్ప ప్రేరణ కాబట్టి కిరణ్ మన కొడుకుకు ఆజాద్ అని పేరు పెట్టాలని సూచించారు.. అని తెలిపాడు. ఆజాద్ అనేది మతపరమైన ఐడెంటిటీని మించిన అంద‌రికీ అర్థ‌మ‌య్యే పేరు అని అమీర్ చెప్పారు. ఆజాద్ ముస్లిం పేరు కాదు. మీరు చంద్రశేఖర్ ఆజాద్ గురించి విన్నారా? ఇది స్వేచ్ఛ అనే ఆలోచన ప్ర‌తిరూప‌మైన పేరు. ఇది ఏ ఒక్క మతానికి చెందినది కాదు.. అందుకే మేము దానిని ఇష్టపడ్డాము... అని తెలిపాడు.

అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకోగా, జునైద్- ఇరా అనే పిల్ల‌లు జ‌న్మించారు. ఈ జంట‌ 2002లో విడిపోయారు. 2005లో స‌హాయ ద‌ర్శ‌కురాలు కిరణ్ రావును అమీర్ వివాహం చేసుకున్నాడు. ఆ జంట 2011లో వారి కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌ను స్వాగతించారు. త‌ర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. కానీ వారి బిడ్డకు సహ తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. అమీర్ ప్రస్తుతం గౌరీ స్ప్రాట్‌తో సంబంధంలో ఉన్నాడు. గౌరీని అమీర్ తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బహిరంగంగా మీడియా ఎదుట ప‌రిచ‌యం చేసారు.

Aamir Khan recently addressed the reason behind his children Islamic-rooted names

Aamir Khan reveals why his kids were named Junaid, Ira and Azad
aamir khan