Advertisement

ఏది దాచాల్సిన అవసరం లేదు: శృతి హసన్

కోలీవుడ్ నటి శృతి హాసన్ చాలా బోల్డ్ అనే విషయం తెలిసిందే. తన కెరీర్ అయినా, వ్యక్తిగత విషయాలైనా ఏదైనా సరే అన్ని ఓపెన్ గా ఉంచుతుంది. సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయంపై ధైర్యం గా మాట్లాడే శృతి హాసన్ తాజాగా షేర్ చేసిన విషయాలు చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే. కాస్మెటిక్ సర్జరీల పై శృతి హాసన్ ఓపెన్ కామెంట్స్ చేసింది. 

నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అది మాత్రమే కాదు నా ముఖం మరింత అందంగా ఉండాలని ఫిల్లర్స్ కూడా వాడాను, ఇలాంటి విషయాలు దాచాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. 

కానీ కొంతమంది ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోరు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దానిని నేను గౌరవిస్తాను. నా వ్యక్తి గత విషయాలు ఓపెన్ గా చెప్పుకునే ధైర్యం, స్వేచ్ఛ నాకు ఉన్నాయి. నా శరీరం నా ఇష్టం, నా శరీరం పై నేను తీసుకునే ఏ నిర్ణయమైనా నా పర్సనల్, అది ఎవ్వరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. 

Shruti Haasan opens up about plastic surgery

Shruti Haasan On Plastic Surgery
shruti haasan