Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakul Preet and Jackky Bhagnani to be honored as Fit India Couple

రకుల్ ప్రీత్ కి పర్ఫెక్ట్ అవార్డు

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఎక్కువ శాతం జిమ్ లోనో లేదంటే యోగాసనాలు వేస్తూనో తన శరీరాన్ని ఫిట్ గా కాపాడుకుంటుంది. అంతేకాదు రకుల్ ప్రీత్ ఎన్నో ఏళ్ళ కిందటే ఫిట్ నెస్ కి రహస్యం వర్కౌట్స్ అంటూ జిమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 

పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ తన సినిమా షూటింగ్స్ తో పాటుగా ఫిట్ నెస్ ని కాపాడుకోవడానికి రోజువారీ దినచర్యగా యోగా, వర్కౌట్స్ ని తన జీవితంలో భాగం చేసుకుంది. జాకీ భగ్నానీ కూడా మంచి ఫిట్ నెస్ ని మైంటైన్ చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా రకుల్ ప్రీత్ ఆమె భర్త జాకీ భగ్నానీ కి ఫిట్ ఇండియా కపుల్ అవార్డు లభించినట్లు రకుల్ ప్రీత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా కపుల్ అవార్డు దక్కించుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలను యోగావైపు ఆకర్షితులను చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉంది, ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్‌గా మారొచ్చు అని రకుల్ తమ ఆనందాన్ని పంచుకోగా.. రకుల్ ఫిట్ నెస్ కి పర్ఫెక్ట్ కపుల్ అవార్డు అంటూ నెటిజెన్స్ స్పందిస్తున్నారు. 

Rakul Preet Singh and Jackky Bhagnani to be honored as Fit India Couple on World Yoga Da

Rakul Preet and Jackky Bhagnani to be honored as Fit India Couple
rakul preet singh