Advertisement

స్టార్ హీరోల బ‌ట్ట‌త‌ల గుట్టు ర‌ట్టు

చాలా మంది హీరోలు బ‌ట్ట త‌ల‌ను దాచేస్తూ, నిండైన జుత్తుతో సూప‌ర్ స్టార్లుగా కొన‌సాగుతున్నారు. ర‌జ‌నీకాంత్, ఎన్బీకే, చిరంజీవి సంగ‌తి అటుంచితే, మ‌హేష్, ప్ర‌భాస్ లాంటి స్టార్లు బ‌ట్ట‌త‌ల ప్ర‌భావానికి గుర‌య్యారనే ప్ర‌చారం ఉంది. వీరంతా విదేశాల్లో ఖ‌రీదైన సాంకేతిక విధానంలో రూపొందించిన హెయిర్ (విగ్గు)తో దానిని దాచేస్తున్నార‌ని కూడా పుకార్లు ఉన్నాయి.

అదంతా అటుంచితే, ఇప్పుడు వార్ 2లో న‌టిస్తున్న హృతిక్ రోష‌న్ బ‌ట్ట తల గురించి చాలా ప్ర‌చారం సాగుతోంది. అత‌డిది ఒరిజిన‌ల్ హెయిర్ కాదు.. పెట్టుడు త‌ల (విగ్గు) అంటూ ప్ర‌చారం సాగుతోంది. తాజాగా దీనిపై ఆలిమ్ హ‌కిమ్  అనే ప్ర‌ముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ వివ‌ర‌ణ ఇచ్చాడు. హృతిక్ నేచుర‌ల్ హెయిర్ ఉన్న హీరో. అత‌డిది బ‌ట్ట‌త‌ల కాద‌ని అత‌డు వ్యాఖ్యానించాడు. నాకు ఉన్న‌ట్టు అత‌డికి బ‌ట్ట‌త‌ల లేదు.

విగ్గు ధ‌రించ‌డు. నేచుర‌ల్ హెయిర్ కాబ‌ట్టే వార్ సినిమాలో హెలీకాఫ్ట‌ర్ స‌న్నివేశంలో అత‌డి హెయిర్ అంత ప్ర‌భావ‌వంతంగా క‌నిపించింద‌ని అన్నాడు. కృత్రిమ విగ్గుల‌తో ఇది సాధ్యం కాద‌ని చెప్పాడు. స్టార్ల హెయిర్ గురించి చాలా ప్ర‌చారం సాగుతుంది. కానీ అవ‌న్నీ నిజాలు కావు అని కూడా అత‌డు అన్నాడు. టాలీవుడ్ లో నాగార్జున స‌హా ప‌లువురు స్టార్లకు ఆలిమ్ హ‌కీమ్ హెయిర్ స్టైలిష్ట్. అత‌డి సూచ‌న‌ల‌ను తెలుగు స్టార్లు ఫాలో  చేస్తుంటారు. అయితే తెలుగు స్టార్ల‌లో ఎవ‌రెవ‌రికి బ‌ట్ట‌త‌ల ఉంది? అనేది అత‌డు ఎప్ప‌టికీ రివీల్ చేయ‌లేడేమో!

Star heroes maintaining bald head as secret

star heroes and their bald heads
star heroes bald heads