NTRని దూరం పెట్టడానికి కారణమిదే-పురందరేశ్వరి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలోనే పుట్టినప్పటికీ.. ఆ ఫ్యామిలీ లో ఎన్టీఆర్ స్వతంత్రంగా ఉండలేరు, అసలు నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ని తమలో ఒకడు అని ఎందుకో అనుకోరు. ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబానికి కాస్త దూరంగానే ఉంటారు. బాలకృష్ణ ఇంకా మిగతా నందమూరి కుటుంబం ఎన్టీఆర్ కి దగ్గరనే ఉన్నట్టుగా ఉన్నా డిస్టెన్స్ ని మైంటైన్ చేస్తారు.
తాజాగా సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరిని ఎన్టీఆర్ ని కుటుంబానికి ఎందుకు దూరంగా పెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఎన్టీఆర్ ని చిన్నప్పుడు కుటుంబానికి దూరంగా పెట్టడానికి చాలా కారణాలున్నాయి, దానిపై చర్చించాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు కుటుంబమంతా ఎన్టీఆర్ తో కలిసే ఉంటున్నాము అని చెప్పారు, అలా ఎన్టీఆర్ ని దూరం పెట్టే కారణాలేమిటో ఆమె వివరించలేదు.
ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు అనే విషయమై కూడా పురందరేశ్వరి స్పదించారు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే వస్తారు. అసలు అతని మనసులో ఏముందో మనకు తెలియదు. ఎన్టీఆర్ ఇంకా చిన్నవాడు, అలాంటప్పుడు అతను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది అనేది మనం ఆలోచించుకోవాలి.. అంటూ పురందరేశ్వరి తారక్ రాజకీయాల్లోకి వచ్చే విషయమై రియాక్ట్ అయ్యారు.
Is Jr NTR Joining Politics? Purandeswari Speaks Out
Purandeswari on Jr NTR








































