మెగా బ్రదర్స్ దోబూచులాట

మెగా బ్రదర్స్ ఇద్దరూ దోబూచులాడుతున్నారు. అందులో ముందుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ తేదీ ఇవ్వకుండా మిగతా సినిమాలను కన్ఫ్యూజ్ చేస్తుంది. మరోపక్క మెగాస్టార్ విశ్వంభర చిత్రం ఎప్పుడు రిలీజ్ డేట్ ఇస్తారా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చెయ్యని రోజు లేదు. మెగా బ్రదర్స్ వలన ఇతర సినిమాల డేట్స్ ఇవ్వలేక నలిగిపోతున్నారు. 

హరి హర వీరమల్లు జూన్ 12 పోస్ట్ పోన్ అయ్యింది, దాని రాక కోసం కొంతమంది హీరోలు వెయిట్ చెయ్యాల్సి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వారు వీరమల్లుకి డెడ్ లైన్ పెట్టారు. అందుకే రెండు మూడు డేట్స్ వేసుకుని మేకర్స్ కూర్చున్నా ఆ డేట్ ఏమిటి అనేది ఖరారు చెయ్యడం లేదు. దానితో విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. 

ఇక మెగాస్టార్ విశ్వంభర గురించి ఏం చెప్పాలి. జనవరి 12 నుంచి పోస్ట్ పోన్ అయిన విశ్వంభర ఆరు నెలలైనా విడుదల తేదీ ఇవ్వట్లేదు, అటు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర భారాన్ని వసిష్ఠ మీద పెట్టి ఆయన అనిల్ రావిపూడి చిత్ర షూటింగ్ కోసం ముస్సోరి వెళ్లారు. అసలు విశ్వంభర విడుదల ఎప్పుడు ఉండబోతుందో అనేది చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. 

మరి ఈ మెగా అన్నదమ్ములు తమ తమ చిత్రాల విడుదల తేదీలను త్వరగా ప్రకటిస్తే బావుంటుంది అనేది మెగా అభిమానుల కోరిక. 

Chiranjeevi And Pawan Kalyan

Mega Brothers
chiranjeevi