Advertisement

మోహన్ లాల్ తుడరుమ్ కాపీ స్టోరీనా

మోహన్ లాల్-శోభన జంటగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తుడరుమ్ చిత్రం మళయాళంలోనే కాదు ఆ సినిమా విడుదలై పాన్ ఇండియా భాషలన్నిటిలో భారీ హిట్ అయ్యింది. మలయాళ ఇండస్ట్రీ లో అయితే తుడరుమ్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 

థియేటర్స్ లో అంతటి భారీ హిట్ అయిన తుడరుమ్ చిత్రం ఓటీటీలోనూ సెన్సేషనల్ హిట్ అవ్వగా.. ఇప్పుడు తుడరుమ్ మూవీపై కాపీ రైట్ ఆరోపణలు చేశాడు డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ సనల్ కుమార్ శశిధరన్. తుడరుమ్ కథ నాదే, నేను రీసెంట్ గానే తుడరుమ్ మూవీ చూశాను. 2020లో నేను తీయట్టం టైటిల్‌తో రాసిన కథను తుడరుమ్ మేకర్స్ కాపీ చేశారు. నేను రాసిన మూలకథను కాపీ చేసి, ఆత్మలేని అస్థిపంజరంతో సినిమా చేశారు. నా స్టోరీ లోని ఆత్మను, సారాంశాన్ని గ్రహించే టాలెంట్ లేకపోవడం వల్ల దాన్ని వదిలేశారు.. ఒరిజినల్‌లోని ఆత్మను తాకలేకపోయారు.. 

ఆత్మ లేకుండా, సరైన సీన్స్ లేకుండానే తుడరుమ్ ని అసంతృప్తిగా వదిలేసారు. నేను తీయట్టం మూవీ ని మంజూ వారియర్, టోవినో థామస్, మురళీ గోపి, సుధీర్ కరమణ ముఖ్య పాత్రల్లో తీయాలని అనుకున్నాను, 2020లో ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌కి కథను ఇచ్చానని, వాళ్లు సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నారని చెప్పిన శశిధరన్.. 

కోవిడ్ వలన గత  ఐదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదని తెలిపాడు. అలాగే త్వరలోనే తన తీయట్టం ఒరిజినల్ స్క్రీన్ ప్లేని సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోతున్నట్టుగా షాకిచ్చాడు సనల్ కుమార్ శశిధరన్. మరి ఈ కాపీ వార్తలపై తుడరుమ్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Thudarum faces plagiarism claims from filmmaker Sanal Kumar Sasidharan

Thudarum faces plagiarism claims
thudarum