Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan To Fulfill Promise to Surender Reddy

పవన్ దానిపై కూడా దయ చూపుతారా

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ ని ఫినిష్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు, OG రెండు చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ ఫినిష్ చేసిన పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ఉన్నారు. అయితే పవన్ కాస్త ఖాళీ చేసుకుని సినిమాను ముగిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. 

అదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మరో ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తారా, ఆ సినిమా నిర్మాతలపై పవన్ దయ చూపుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అదే ఏజెంట్ తో డిజాస్టర్ అందుకుని సైలెంట్ గా ఉన్న సురేందర్ రెడ్డి తో పవన్ కమిట్ అయిన సినిమాని పూర్తి చేస్తారా అంటూ అందరూ మట్లాడుకుంటున్నారు. కేవలం ఎనౌన్సమెంట్ దగ్గరే ఆగిన ఈ చిత్రం పూర్తిగా ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి. 

అది పవన్ రాజకీయాల్లో బిజీగా వున్న సమయంలో అన్నమాట. ఇప్పుడు ఆయన షూటింగ్స్ తో యాక్టీవ్ అవడంతో పవన్ అదే ఊపులో సురేందర్ రెడ్డి మూవీ కూడా కంప్లీట్ చేస్తారా అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. అది కూడా క్లారిటీ వస్తే బావుంటుంది. 

Pawan Kalyan film with Surender Reddy

Pawan Kalyan To Fulfill Promise to Surender Reddy
pawan kalyan