ఇంట్రెస్టింగ్: నయనతార యానివర్సరీ పోస్ట్

కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని గుట్టుగా దాచేసి.. మూడేళ్ళ క్రితం జూన్ 9 న అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, అతిధుల సమక్షంలో వివాహం చేసుకున్న నయనతార-విగ్నేష్ శివన్ లు అదే ఏడాది సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లితండ్రులయ్యారు. అప్పట్లో అదో కాంట్రవర్సీ అయ్యింది.
ఇక నయనతార-విగ్నేష్ శివన్ లు వివాహం చేసుకుని ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తికావడంతో నయనతార సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ తో పాటుగా నయనతార అద్భుతమైన ఫొటోస్ ని కూడా షేర్ చేసింది. నయన్ సోషల్ మీడియా వేదికగా విగ్నేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ..
ఒకరికొకరు ఇంతగా ఎలా ప్రేమించుకుంటారనేది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయమే.. కానీ నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన జర్నీ ఇప్పుడు నలుగురిగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా లైఫ్ పార్ట్నర్ కి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. అంటూ నయనతార ఫొటోస్ ని పంచుకుంది.
Nayanthara Posts Romantic Pictures With Vignesh Shivan On Their 3rd Anniversary
Nayanthara poetic anniversary post for Vignesh overflows with love







































