ఫెయిల్యూర్ ని కూడా స్వీకరించాలి-పూజ హెగ్డే

Pooja Hegde on Handling Film FlopsPooja Hegde on Handling Film Flops

కొన్నాళ్లుగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్న పూజ హెగ్డే ని సూర్య రెట్రో అయినా ఆదుకుంటుంది అనుకుంటే ఆ చిత్రం కూడా పూజ హెగ్డే ని డిజప్పాయింట్ చేసింది. ప్రస్తుతం తమిళనాట స్టార్ హీరో విజయ్ తో జన నాయగన్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూజ హెగ్డే ఫెయిల్యూర్, సక్సెస్ ల గురించి మాట్లాడింది. విజయ్ తో జన నాయగన్ లో పని చెయ్యడం అద్భుతం, కానీ విజయ్ ది ఇదే చివరి చిత్రం అంటే చాలా బాధగా ఉంది. నాతో పాటు విజయ్ ని ఇష్టపడే అందరికి ఇది చేదు వార్తే. 

ఇక బాలీవుడ్ లో రీసెంట్ గా నేను నటించిన సర్కస్, కిసి కా భాయ్ కిసీ కీ జాన్, దేవా చిత్రాలు వరసగా నిరాశ పరిచే ఫలితాలే ఇచ్చాయి. కొన్నేళ్లుగా నా కెరీర్ లో విజయ అనే పదం దూరమైపోయింది. కానీ ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు చాలా ఇంపార్టెంట్. వాటిలో చూసి మమ్మల్ని ప్రేక్షకులు తిరిగి ప్రేమిస్తారు. 

నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను, అవన్నీ అధిగమించి నేను ఈ స్థాయికి చేరుకున్నాను, ఇంకా సాధించాల్సింది ఉంది. కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పుడు, అందులోని పాత్రల్లో ఒదిగిపోయి జీవిస్తాము, అవి ఫెయిల్యూర్ అయినప్పుడు బాధపడతాము, మేము నటులం, సో సక్సెస్ ని ఫెయిల్యూర్ ని రెండిటిని స్వీకరించాలి. 

ఒకవేళ మేము ఫెయిల్యూర్ ని తీసుకోలేకపోతే మళ్లీ మేము ప్రేక్షకుల ముందు నిరూపించుకోలేము. ఇది అందరికి వర్తిస్తుంది అంటూ పూజ హెగ్డే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ పై స్పందించింది. 

Pooja Hegde Opens Up On Box Office Failures

pooja hegde