Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jumped 16 times with a loaded parachute

త‌గ‌ల‌బ‌డిన పారాచూట్‌తో 16సార్లు జంప్

గాల్లో అరివీర భ‌యంక‌ర సాహ‌సాలు చేయాలంటే టామ్ క్రూజ్ త‌ర్వాతే. ఎంఐ సిరీస్ సినిమాల్లో ఏథ‌న్ హంట్ అనే గూఢ‌చారి (ఏజెంట్) పాత్ర‌లో న‌టించాడు. భారీ ఫైట్ సీక్వెన్సులే కాకుండా, ఒక ప్లేన్ మీంచి ఇంకో ప్లేన్ మీదికి దూక‌డం, హెలీ కాఫ్ట‌ర్ రెక్క‌లు పట్టుకుని వేలాడ‌టం ఒక‌టేమిటి అత‌డు చేయ‌ని విన్యాసాలు లేవు. భూమి పై నుంచి దాదాపు 10000 మీట‌ర్ల ఎత్తు నుంచి పారా చూట్ సాయంతో దూకేయ‌డం, ఆ పారా చూట్ మ‌ధ్యలోనే త‌గ‌ల‌బ‌డ‌టం లేదా చిక్కులు ప‌డిపోవ‌డం వంటి ఎన్నో ప్ర‌మాదాల న‌డుమ అత‌డి సాహ‌సాలు చూస్తే ఔరా! అన‌కుండా ఉండ‌లేరు.

వీటిలో డూప్ లేకుండా న‌టిస్తాడు కాబ‌ట్టే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ప‌రిశీలన‌లోకి వెళుతున్నాడు టామ్. ఇప్పుడు అత‌డు గిన్నిస్ బుక్స్ లో అరుదైన రికార్డును సృష్టించాడు. ఫైన‌ల్ రిక‌నింగ్ మూవీ చిత్రీక‌రణ స‌మ‌యంలో దాదాపు 16 సార్లు మండుతున్న పారా చూట్ తో అత‌డు పై నుంచి దూకాడు. దాదాపు 7500 మీట‌ర్లు ఎత్తు నుంచి టామ్ పారాచూట్ సాయంతో దూకాడు. ఇది గొప్ప రికార్డ్. ఏ ఇత‌ర స్టార్ చేయ‌లేని సాహ‌సం... అని గిన్నిస్ బుక్ ధృవీక‌రించింది. నాన్ అవ‌తార్, నాన్ సూప‌ర్ మేన్ ఫ్రాంచైజీ రికార్డుల్లోను టామ్ క్రూజ్ ఎంఐ సిరీస్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది.

ఎంఐ సిరీస్ లో 11 చిత్రాలు వరుసగా అత్యధికంగా 100 మిలియన్ల డాల‌ర్లు వసూలు చేసిన నటుడిగా రికార్డును సృష్టించిన టామ్ ఫ్రాంఛైజీలో చిట్ట చివ‌రి మూవీ  `మిష‌న్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్`తో 389.5 మిలియన్ డాల‌ర్లు పైగా వ‌సూలు చేయ‌డం మ‌రో అరుదైన‌ రికార్డ్.

Tom Cruise Awarded Guinness World Record After Doing 16 Burning Parachute Jumps

Jumped 16 times with a loaded parachute
tom cruise