Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Muzammil Ibrahim reveals he dated Deepika Padukone

దీపిక‌తో రెండేళ్లు డేటింగ్.. మోడ‌ల్ లీకులు

దీపికా పదుకొనే 2000లలో మోడల్ కావడానికి ముంబైకి వెళ్లినప్పుడు అప్ప‌టికి ప్ర‌ముఖ మోడ‌ల్ కం నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం రెండేళ్లపాటు డేటింగ్ చేసాన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అయితే త‌మ సంబంధం ముగిసింద‌ని, దానికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ కావ‌డం లేద‌ని కూడా వెల్ల‌డించాడు.

టీవీ హోస్ట్, పాడ్‌కాస్టర్ సిద్ధార్థ్ కన్నన్‌తో తాజా ఇంట‌ర్వ్యూలో దీపికతో తనకున్న సంబంధం గురించి ముజ‌మ్మిల్ వివరాలను వెల్లడించాడు. దీపిక స్వ‌యంగా తనను డేట్ కి ఆహ్వానించిందని అతడు చెప్పాడు. అప్ప‌ట్లో రెండు సంవత్సరాల పాటు సంబంధంలో ఉన్నాము. దీపిక ప్రకాష్ పదుకొనే కుమార్తె కాబట్టి ప‌రిచ‌యాలు త‌న‌కు సులువు. చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది. అందరికీ ఆమె గురించి తెలుసు`` అని ముజమ్మిల్ అన్నారు. ఆ సమయంలో నేను స్టార్‌ని.. త‌ను అప్ క‌మ్ మోడ‌ల్. ఆమె ఇప్పుడు సూపర్‌స్టార్. త‌ను అందరికీ బాగా తెలుసు. నేను ఎవ‌రో ఇప్పుడు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియదు... అని అన్నాడు.

దీపిక‌కు నేను పెద్ద అభిమానిని. త‌ను న‌టించిన సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఆమె చాలా అందమైన న‌టి. దీపిక పెళ్లికి ముందు మేం కొన్నిసార్లు మాట్లాడుకునేవాళ్ళం! అని కూడా అత‌డు చెప్పాడు. ఆ రోజుల‌లో మేం ఇద్ద‌రం ఆర్థికంగా ఇబ్బంది ప‌డ్డాం. ఖర్చు చేయడానికి తగినంత డబ్బు లేకపోవడంతో రిక్షాలో `అందమైన డేట్స్` కు వెళ్లామ‌ని ముజమ్మిల్ తెలిపారు. నేను బాగా సంపాదించాక కార్ కొన్నాను. దానికి దీపిక చాలా సంతోషించింది. అప్పటి నుండి నేను రిక్షాలో డేటింగ్ చేయలేదు. నిజానికి మా దగ్గర డబ్బు లేక‌పోయినా చాలా సంతోషంగా ఉన్నాము.. ఇవ‌న్నీ చిర‌స్మ‌ర‌ణీయ జ్ఞాప‌కాలు`` అని ఆయన అన్నారు.

పూజా భట్ దర్శకత్వం వహించిన ధోఖా చిత్రంలో హీరోగా న‌టించాడు ముజమ్మిల్. స్పెషల్ ఓపిఎస్ లో అవినాష్ పాత్ర పోషించడం ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ లీలా స‌మ‌యంలో దీపిక రణ్‌బీర్ కపూర్‌తో బంధంలో ఉంది. ఈ జంట 2007 నుండి 2010 వరకు డేటింగ్ చేసింది. అంత‌కుముందు ర‌ణ‌బీర్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం తెలిసిందే. మోడ‌ల్ గా కెరీర్ ఆరంభంలో న‌టుడు కం మోడ‌ల్ ముజ‌మ్మిల్ తో దీపిక‌ డేటింగ్ చేసింది.  ఇటీవ‌ల ప్ర‌భాస్ స్పిరిట్ నుంచి దీపిక‌ను ద‌ర్శ‌కుడు సందీప్ వంగా తొల‌గించ‌డంపై చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో దీపిక గురించిన ప్ర‌తి వార్తా సెన్సేష‌న్ గా మారుతోంది.

Muzammil Ibrahim says he was in a relationship with Deepika Padukone for 2 years

Muzammil Ibrahim reveals he dated Deepika Padukone
deepika padukone