కమల్ బాలీవుడ్ వదిలేయడానికి కారణం

`ఏక్ దుజే కేలియే` లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన కమల్ హాసన్ బాలీవుడ్ వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? ఈ ప్రశ్నకు థగ్ లైఫ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కమల్ చెప్పిన షాకింగ్ ఆన్సర్ ఏమిటో తెలుసా?
ఇండియన్ సినిమా లెజెండ్ కమల్ హాసన్ బాలీవుడ్ లో క్రేజీ హిట్లలో నటించి అప్పటి హిందీ హీరోలకు కూడా పెద్ద పోటీనిచ్చారు. అసలు కమల్ హాసన్ ప్రతిభ ముందు ఎవరూ నిలబడలేని పరిస్థితి ఉండేది. కానీ వన్ ఫైన్ డే ఆయన హిందీ పరిశ్రమను వదిలేసి, సౌత్ కి వచ్చేసారు. ఇక్కడ మద్రాసులో తమిళ చిత్రాలు చేసుకుంటూ, తెలుగు అనువాదాల్ని అందిస్తూ లేదా నటిస్తూ బిజీ అయ్యారు.
దీనికి కారణాలపై ఆరా తీయగా, కమల్ హాససన్ షాకింగ్ జవాబిచ్చారు. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఒక నిర్దిష్ట సమయంలో బాలీవుడ్ నుండి దూరమవ్వాల్సి రావడానికి కారణం...అక్కడ పాత్రలు లేకపోవడం లేదా గుర్తింపు లేకపోవడం వల్ల కాదు.. ఆ కాలంలో పరిశ్రమపై అండర్ వరల్డ్ పట్టు ఉండటం తీవ్ర అసౌకర్యం కలిగింది. మాఫియా బాలీవుడ్ లో పెట్టుబడులు పెట్టేది. కాస్టింగ్ లేదా కళాకారుల వ్యక్తిగత భద్రతను కూడా మాఫియా సవాల్ చేసేది. హిందీ చిత్రసీమలో నటించడం అంటే నేరాలతో అంటకాగడమేనని కమల్ కి వేగంగా అర్థమైంది.
ఇది అతడిని చాలా ఆలోచింపజేసిది. వెంటనే అతడు మరో ఆలోచనే లేకుండా దక్షిణ భారత సినిమాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ కళాత్మక స్వేచ్ఛ, నటనా వైవిధ్యంతో తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకున్నాడు. అతడి నిర్ణయం నటులు కొన్నిసార్లు కళాకారుడి వ్యక్తిగత విలువలను కాపాడుకోవడానికి ఎలాంటి సాహసానికి అయినా సిద్ధమవుతాడని నిరూపించింది.
Reason behind Kamal haasan leaving Bollywood
Why Kamal Haasan Left Bollywood







































