మతిపోగొడుతున్న శృతి హాసన్ లుక్

Shruti Haasan stunning lookShruti Haasan stunning look

పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడి సినిమాలకు బ్రేకిచ్చి, కం బ్యాక్ అయ్యాక మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది, ఇకపై శృతి హాసన్ కి తిరుగుండదు అనుకున్నారు. కానీ శృతి హాసన్ చేసుకున్న చిన్న చిన్న తప్పిదాలు ఆమెకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారేలా చేసాయి. అందులో శృతి హాసన్ తప్పుందో, లేదంటే మారేదన్నానో తెలియదు కానీ.. తెలుగులొ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన శృతి హాసన్ కి ఇక్కడ ప్రస్తుతం ఒక్క ఛాన్స్ కూడా లేదు. 

ఇక తమిళనాట కూలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న శృతి హాసన్ కొన్నేళ్ల తర్వాత తండ్రి కమల్ హాసన్ థగ్ లైఫ్ ఆడియన్స్ లాంచ్ కోసం లైవ్ కాన్సెర్ట్ చేసింది. శృతి హాసన్ మ్యూజిక్ కంపోసర్ మరియు సింగర్ అనే విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో పాటుగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంది. 

ముఖ్యంగా ఆరోగ్య విషయాలను మొహమాటం లేకుండా పంచుకునే శృతి హాసన్ తాజాగా షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ పిక్స్ మాత్రం మతిపోగొడుతున్నాయనే చెప్పాలి. గ్లామర్ కి గ్లామర్, అందానికి అందం తో శృతి హాసన్ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో నిజంగా మతిపోగొట్టేసింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Shruti Haasan stunning look goes viral

shruti haasan