ఎన్టీఆర్.. డ్రాగన్ or ఎంటర్ ది డ్రాగన్

NTR Dragon Title DilemmaNTR Dragon Title Dilemma

ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు నెలల క్రితమే న్యూస్ బయటికి వచ్చింది. అయితే యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ పేరు మాత్రం భలే పవర్ ఫుల్‌గా ఉందని అభిమానులు సంబరపడ్డారు.

కట్ చేస్తే ఇదే పేరుతో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 21 విడుదల కానుంది. ప్రోమోలు, లిరికల్ వీడియోలు చూస్తే వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. హిట్టయితే మాత్రం ఈ టైటిల్ క్రెడిట్ మొత్తం ఆ సినిమాకే పోతుంది.

అదే జరిగితే భవిష్యత్తులో ఇదే డ్రాగన్ టైటిల్‌ని తారక్ కి పెట్టుకోవడం కుదరదు. గతంలో ఇలాంటి సమస్యలు పలు సినిమాలకు వచ్చాయి. ఖలేజా, కత్తి, గ్యాంగ్ లీడర్‌లకు కాంట్రవర్సీ వచ్చినప్పుడు నిర్మాతలు వాటి ముందు హీరోల పేర్లు పెట్టి మేనేజ్ చేశారు.. కానీ ఇప్పుడలా కుదరదు.

ఒకవేళ ఎన్టీఆర్ డ్రాగన్ అని పెట్టినా సింక్ అవ్వదు. పైగా యాంటీ ఫ్యాన్స్ కావాలని ప్రదీప్ డ్రాగన్ పోలిక తీసుకొచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. సో ప్రశాంత్ నీల్ దేనికి ఫిక్స్ అవుతారనేది ఇప్పుడే చెప్పలేం. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయినా తారక్ లాంటి పాన్ ఇండియా హీరో పూర్తిగా టైటిల్ మీదే ఆధారపడడు కానీ.. అలా అని దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి కూడా లేదు. దేవర కూడా వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయ్యుంటే అడిగి తీసుకోవడం ఫ్యాన్స్ కి గుర్తే. కానీ డ్రాగన్‌కు ఆ ఛాన్స్ లేదు. పైగా అది తమిళంతో పాటు తెలుగులో కూడా సమాంతరంగా రిలీజవుతోంది.

ఒకవేళ ఎంటర్ ది డ్రాగన్ అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేయవచ్చు కానీ మరీ అంత ఇంగ్లీష్ సౌండింగ్ ఉన్నా మాస్ కి చేరడం కష్టమే. గేమ్ ఛేంజర్ విషయంలో ఈ పొరపాటు జరిగింది. చూడాలి తారక్- నీల్ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో..

NTR and Prashanth Neel Dragon: A Title Controversy Ahead of Film Shoot

ntr dragon