టీడీపీ కార్యకర్తలకు పెద్ది రెడ్డి వార్నింగ్

కూటమి ప్రభత్వం తమని, తమ కార్యకర్తలను రకరకాల కేసులు పెట్టి వేధిస్తుంది, అది చూసి టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేము గెలవకపోము, మీ అంతు చూడకపోము అంటూ వైసీపీ ఎమ్యెల్యే పెద్ది రెడ్డి టీడీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తున్నారు.
నెక్స్ట్ ఎలెక్షన్ లో వైసీపీ గెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం వస్తుంది, జగన్ సీఎం అవుతారు అప్పుడు టీడీపీ కార్యకర్తల తీస్తామంటూ పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అధికారంలో ఉన్నపుడు టీడీపీ వాళ్ళను, జనసేన కార్యకర్తలను వారు ఎంతగా ఇబ్బంది పెట్టారో ఆయన మరిచిపోయి ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఆ రకమైన వ్యాఖ్యలు చెయ్యడం ఏపీ ప్రజలను విస్మయానికి గురి చేసింది.
వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. వైసీపీ అంటే సపోర్ట్ చేసే సోషల్ మీడియా వారిని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది, వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల భరతం పడతామని, వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులకు కచ్చితంగా ప్రతిదాడులు ఉంటాయని పెద్దిరెడ్డి హెచ్చరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు.
Peddireddi warned TDP workers of retaliation after the elections
Peddi Reddy warning to TDP workers





































