విశాల్ తో పెళ్లి రూమర్స్-అభినయ లవ్ స్టోరీ

నటి అభినయను కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు, విశాల్-అభినయ సీక్రెట్ డేటింగ్ చేస్తున్నారనే వార్త కోలీవుడ్ లో చాలా కాలంగా గట్టిగానే చక్కర్లు కొడుతోంది. కానీ విశాల్ మాత్రం అభినయంతో ప్రేమ, పెళ్లి వార్తలను కొట్టిపారేశాడు. తాజాగా అభినయ విశాల్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చింది.
అభినయ రీసెంట్ గా నటించి సక్సెస్ అయిన జోజు జార్జ్ పని మూవీ ఇంటర్వ్యూలో భాగంగా అభినయ విశాల్ తో ప్రేమ పై వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యింది. మీరు సింగిల్ గా ఉన్నారా లేదంటే రిలేషన్ లో ఉన్నారా అన్న ప్రశ్నకు అభినయ ఇలా ఆన్సర్ ఇచ్చింది.
తాను 15 ఏళ్ళు కలిసి చదువుకున్న ఫ్రెండ్ ని ప్రేమిస్తున్నాను, తనతోనే అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా అభినయ తన ప్రేమను బయటపెట్టింది. దానితో విశాల్ తో ప్రేమ, పెళ్లి రూమర్స్ కు అభినయ అలా అడ్డుకట్ట వేసింది.
Abhinaya clarifies the gossips that she is going to marry hero Vishal
Abhinaya about marriage plans





































