వైజాగ్ అల్లుడి పరువు నిలబెట్టండి-చైతు

Naga Chaitanya on Vizag connectionNaga Chaitanya on Vizag connection

నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ నిర్ణయించారు. ఇందులో చైతన్యకు జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్‌గా నిలిచాయి.

తాజాగా వైజాగ్‌లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది. ఈ వేడుకలో నాగ చైతన్య తన స్పీచ్‌తో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా వైజాగ్ ఆడియన్స్‌కు ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాడు. ఇక్కడ ఒక సినిమా హిట్ అయితే ప్రపంచంలో ఎక్కడైనా ఆడుతుంది అని చెబుతూ తనకు వైజాగ్‌తో ఉన్న అనుబంధాన్ని వివరించాడు.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చైతన్య పంచుకున్నాడు. నాకు వైజాగ్‌తో ప్రత్యేకమైన బంధం ఉంది. వైజాగ్ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందాడు. తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్‌దేనని అన్నారు. అభిమానులు భారీ కలెక్షన్స్ తెచ్చి సినిమాను పెద్ద హిట్ చేయాలని చైతన్య కోరాడు.

ఇప్పటికే లవ్ స్టోరీలో వీరిద్దరి కాంబినేషన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి తండేల్ సినిమా దేశభక్తి నేపథ్యంలో రూపొందింది. విడుదలైన పాటలు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ కూడా సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందా లేదా అనేది ఫిబ్రవరి 7న తెలుస్తుంది.

I fell in love with and married a girl from Vizag - Naga Chaitanya

naga chaitanya