మహా కుంభమేళాలో ఘోరం

Bad luck in Maha Kumbh MelaBad luck in Maha Kumbh Mela

ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా కోసం కోట్లాది ప్రజలు కదులుతున్నారు. ఇప్పటికే కోటి కి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసారు. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాల కోసం స్పెషల్ ట్రైన్స్, బస్సులు అంటూ ప్రభుత్వాలు హడావిడి చేస్తుంటే ఎయిర్ లైన్స్ వారు అధిక ధరలకు ఫ్లైట్ టికెట్స్ అమ్ముతూ కోట్లు దండుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు ఇపుడు ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన అపశృతి భక్తుల ఒళ్ళు జలదరించేలా చేసింది. 

మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆ తాకిడికి బారికేడ్లు విరగడంతో అక్కడ తొక్కిసలాట జరగడం షాకిచ్చింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. 

సెక్టర్ 2 లో జరిగిన దారుణ ఘటన లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బాధితుల ను అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారుల ప్రకటించారు. 

Maha Kumbh Mela

maha kumbh mela