విజయసాయికి జగన్ ఇచ్చిన టాస్కేంటి

Jagan task to Vijayasai ReddyJagan task to Vijayasai Reddy

విజయసాయిరెడ్డి రాజీనామా చేసి, రాజకీయాలకు దూరమైనా ఆయన గురించి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఉన్నఫలంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి నీడగా, ఆత్మగా అంతకుమించి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సాయిరెడ్డి ఇంత సడన్‌గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అనేదానిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఎవరికి తోచినట్లు వాళ్లు వార్తలు రాసేసుకుంటున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు, నేతలు మాత్రం సాయిరెడ్డి రాజీనామా తర్వాత తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే సాయిరెడ్డి ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా సరే జగన్ కోసమే పనిచేస్తారని, ఆయన వేసే ప్రతి అడుగూ వైసీపీ కోసమేనని సంతోష పడుతున్నారు. అంతేకాదు సాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేదానిపై ఆయనకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయిరెడ్డేనే?

రాజకీయాలొద్దు.. వ్యవసాయమే ముద్దు అంటున్న సాయిరెడ్డి నిజంగానే వ్యవసాయిరెడ్డిగా మారుతారా? అంటే అవును కానీ అది రైతులు చేసే వ్యవసాయం కాదని చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎప్పట్నుంచో మీడియా రంగంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఏ పార్టీకి, ఏ ప్రాంతానికి, అసలు రాజకీయాలకు సంబంధమే లేకుండా అన్నింటినీ వదులుకున్నాకే మీడియా రంగంలోకి దిగాలని ఫిక్స్ అయ్యారు గనుకే ఇలా తొలుత రాజీనామా, రాజకీయాలకు దూరం అన్నట్లుగా ప్రకటించారని సాయిరెడ్డి ఆప్తులు చెబుతున్నారు. దీనికి వైసీపీ కార్యకర్తలు మాత్రం తెగ ఎలివేషన్స్ ఇస్తున్నారు. అబ్బో అదేదో పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబులాగా వ్యవసాయం చేస్తారని, అది మీడియా రంగంలోనేనని చెప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆయనపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏ రేంజిలో ఆటాడించిందో, ఆడుకుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శాంతి విషయంలో అయితే ఆయన్ను నిలువునా బట్టలిప్పేసినట్లుగా ఓ మీడియా సంస్థ ప్రవర్తించింది. ఆ నాడే తాను మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

పెద్ద బాధ్యతే!

వాస్తవానికి వైసీపీకి మీడియా సపోర్టు చాలా తక్కువగా ఉందన్నది పదే పదే ఆ పార్టీ క్యాడర్ మొదలుకుని అధినేత జగన్ వరకూ పదే పదే చెబుతున్న మాట. అందుకే సోషల్ మీడియాను గట్టిగా వాడుకోవాలని ప్రతి సమావేశంలోనూ చెబుతుంటారు జగన్. అందుకే వైసీపీకి సపోర్టుగా, రానున్న 2029 ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని, ఇప్పుడున్న మీడియా సంస్థల కంటే అగ్రస్థానంలో ఉండేలా, అటు ప్రజా సమస్యలు, ఇటు పార్టీకి సపోర్టుగా పనిచేయాలని, ఇక పార్టీలో లేకపోయినా అవసరమైనప్పుడు సేవలు అందించాలని పెద్ద టాస్కే ఇచ్చారట. ఇదే అతి పెద్ద టాస్క్ అని బయట ప్రచారం జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు, అటు సాయిరెడ్డికి, ఇటు జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్లే ఈ మాటలు చెప్పుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇక ఎలాగో కేంద్రంలో వ్యవహారాలన్ని అనఫిషియల్‌గా సాయిరెడ్డే చూడాలని చెప్పారట. ఈ రెండే సాయిరెడ్డికి జగన్ రెడ్డి ఇచ్చిన టాస్క్‌లు. ఇందులో నిజానిజాలెంత? మీడియాలో వ్యవసాయం చేస్తారా? లేకుంటే.. ఏం చేస్తారు? అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానున్నది.

Vijayasai Reddy quits politics

vijayasai reddy