ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Gorantla Butchaiah Chowdary about Lokesh DY CM

లోకేష్‌ కు డిప్యూటీ అనడం సరికాదు

ఈమధ్యన టీడీపీ లో కొత్త రాగం వినిపించింది. టీడీపీ ని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడిన లోకేష్ కు డిప్యూటీ పదవి ఇవ్వాలంటూ అభిమానులు, నేతలు, టీడీపీ కార్యకర్తలు చాలామంది డిమాండ్ చేసారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యాలనే వాదన అధిష్టానం వద్దకు వెళ్లడం అధిష్టానం దానికి అడ్డుకట్ట వెయ్యడం చూసాము. 

తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. లోకేష్‌ డిప్యూటీ సీఎం అంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు. టీడీపీ నేతలు లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనడం సరికాదు.. కూటమి ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పార్టీ కోసం లోకేష్‌ కష్టపడి పని చేశారు.. 

లోకేష్ కష్టానికి అధిష్టానం సముచిత స్థానం ఇచ్చింది.. అది సరిపోతుంది అన్న రీతిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లోకేష్ డిప్యూటీ సీఎం అంశం పై స్పందించారు. 

Gorantla Butchaiah Chowdary on Nara Lokesh DY CM

Gorantla Butchaiah Chowdary about Lokesh DY CM
nara lokesh