ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> AR Rahman NOT replaced by Devi Sri Prasad

RC16 నుంచి రెహమాన్ తప్పుకోలేదా

AR Rahman NOT replaced by Devi Sri PrasadAR Rahman NOT replaced by Devi Sri Prasad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కలయికలో ఓ స్పోర్ట్స్ డ్రామా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి ఓ పుకారు చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ సినిమా నుంచి ఎఆర్ రెహమాన్ తప్పుకొని అతని స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ చేరారన్నది. ఉప్పెన సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మ్యూజికల్ హిట్ కావడంతో ఆయనను తీసుకొచ్చారని పుకారు వెలువడింది. కానీ ఇది పూర్తిగా ఫేక్ వార్త. ఈ సినిమా కోసం ఎఆర్ రెహమాన్ ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్లు అందించారు. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు ఎంతో కష్టపడి రెహమాన్‌ను సంప్రదించారు. ఆయనతో కలిసి నెలల తరబడి పని చేశారు. అలాంటప్పుడు హఠాత్తుగా రెహమాన్‌ను పక్కన పెట్టడం అసంభవమే. ఇది అభిమానుల ఊహాజనిత ప్రచారమే.

ఇక ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. మొదట ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల అది రామ్ చరణ్ చేతికి వచ్చింది. చరణ్ శైలికి తగ్గట్లు కొన్ని మార్పులు చేసి బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్‌ను ఆసక్తికరంగా మలుస్తున్నారు.

AR Rahman Is Very Much On board For Ram Charan, Buchibabu Project

ar rahman