విడుదలైన వారానికే ఓటీటీలోకి

మలయాళంలో టొవినో థామస్-త్రిష జంటగా తెరకెక్కిన ఐడెంటిటీ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. తెలుగులో డబ్ చేసి నిన్న జనవరి 24 న విడుదల చేసారు. సంక్రాంతి సినిమాలు హవా కొనసాగుతున్న సమయంలోనే టొవినో థామస్ ఐడెంటిటీని టాలీవుడ్ లో రిలీజ్ చేసారు.
తెలుగులో నిన్న విడుదలైన ఈచిత్రాన్ని ఓటీటీ నుంచి ఈ నెల 31 నుంచి ఈ చిత్రం జీ5లోకి రానుందని ప్రకటించారు. మలయాళంలో ఐడెంటిటీ విడుదలై మూడు వారాలు అవుతుంది. అందుకే నాలుగు వారాలకు గాను ఐడెంటిటీని ఓటీటీ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
అది కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓటీటీలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. అంటే తెలుగులో థియేటర్లోకి వచ్చిన వారంలోనే ఓటీటీలోకి రానుంది. దీంతో ఈ మూవీని తెలుగు వాళ్లు థియేటర్లో చూడకుండా వదిలేస్తారు. వారం ఆగితే ఓటీటీలోకే వస్తుంది కదా అని లైట్ తీసుకుంటారు. అలాంటప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదలవడం ఎందుకు అనేది అందరి ప్రశ్న.
Tovino Thomas Identity To Stream On ZEE5
This Week Release Announces OTT Date




































