Advertisementt

చైతు-సాయి పల్లవి పోస్టర్స్ తోనే కొడుతున్నారు

Wed 18th Dec 2024 11:33 AM
thandel  చైతు-సాయి పల్లవి పోస్టర్స్ తోనే కొడుతున్నారు
Shiva Shakti song poster from Thandel చైతు-సాయి పల్లవి పోస్టర్స్ తోనే కొడుతున్నారు
Advertisement
Ads by CJ

చందు మొండేటి ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొడతారని అక్కినేని అభిమానులే కాదు మూవీస్ లవర్స్ అంతా ఫిక్స్ అయ్యేలా తండేల్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే తండేల్ నుంచి నాగ చైతన్య-సాయి పల్లవిల బుజ్జి తల్లి సాంగ్ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. తండేల్ లోని చైతు-సాయి పల్లవుల కెమిస్ట్రీ కి అందరూ పడిపోతున్నారు. 

ఇప్పుడు శివ శక్తి పూర్తి పాట ఈ నెల 22 న రాబోతున్నట్టుగా మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో పాటుగా నాగ చైతన్య-సాయి పల్లవి ల పోస్టర్ అయితే క్రేజీగా వైరల్ అయ్యింది. శివ-పార్వతులు వలె నాగ చైతన్య-సాయి పల్లవి ల ఫోజ్ అక్కినేని అభిమానులను బాగా ఇంప్రెస్ చెయ్యగా.. సాధారణ ప్రేక్షకులు తండేల్ పోస్టర్స్ తోనే కొడుతున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

నిజంగా లవ్ స్టోరీ చిత్రం కన్నా ఎక్కువగా తండేల్ చిత్రంలో నాగ చైతన్య-సాయి పల్లవిల కెమిస్ట్రీ భలే వర్కౌట్ అయ్యింది. వాళ్ళ కెమిస్రి మాములుగా లేదు, బుజ్జి తల్లి కన్నా ఎక్కువగా శివ శక్తి సాంగ్ వైరల్ అవడం ఖాయం. 

Shiva Shakti song poster from Thandel :

Shiva Shakti song from Thandel to spellbound

Tags:   THANDEL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ