కిర్రాక్ లుక్ లో కృతి శెట్టి

ఉప్పెన బ్యూటీ ఉప్పెన బ్యూటీ అంటూ అసలు పేరు మర్చిపోయేలా మాయ చేసిన కృతి శెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ కోసం పాకులాడుతుంది. తెలుగులో డిజప్పాయింట్ చేసే సినిమాలు వరసగా రావడంతో కృతి శెట్టి ఇతర భాషలకు తరలిపోయింది. తమిళనాట క్రేజీ అవకాశాలు కూడా ఒడిసి పట్టుకుంది.
రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ పక్కన నటించింది. ఇక కోలీవుడ్ అవకాశాలతో బిజీగా కనబడుతున్న బేబమ్మ ఈమధ్యన సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో కృతి శెట్టి కిక్ ఇస్తుంది. తరచూ ఫ్రెష్ ఫోటో షూట్స్ తో అద్దరగొట్టేస్తుంది.
తాజాగా కృతి శెట్టి అదిరిపోయే ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో లూజ్ హెయిర్ తో కృతి శెట్టి కిర్రాక్ ఫోజులో మత్తెక్కించింది. కృతి శెట్టి ఫొటోస్ చూడగానే చూపులతో మత్తెక్కించి చంపకే అంటూ యూత్ సాంగ్ వేసుకోవడం మాత్రం ఖాయం.
Krithi Shetty latest look goes viral
Krithi Shetty in Kirrak look







































