మరోసారి శివుని పేరుతో సుధీర్ బాబు

Sudheer Babu Jatadhara First Look OutSudheer Babu Jatadhara First Look Out

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించనున్న తదుపరి చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేస్తూ శనివారం మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. అంతకు ముందు ఈ సినిమా టైటిల్ ఏంటో కనుక్కోండి అంటూ సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా కొన్ని క్లూస్ ఇస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కి నెటిజన్లు చాలా మంది ఇచ్చిన ఆన్సరే.. ఇప్పుడు టైటిల్‌గా ఫిక్స్ అయింది. ఈ చిత్రానికి జటాధర అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. 

మహాశివునికి జటాధరుడు అని కూడా పేరు. అలాంటి క్లూస్‌నే సుధీర్ బాబు ఇవ్వడంతో చాలా మంది కరెక్ట్‌గానే గెస్ చేశారు. ఇక టైటిల్‌తో పాటు సుధీర్ బాబు ఫస్ట్ లుక్‌ని కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో త్రిశూలం పట్టుకుని పవర్‌ఫుల్‌గా సుధీర్ బాబు కనిపిస్తున్నారు. అలాగే బ్రాక్‌గ్రౌండ్‌లో జటాధరుడైన మహాశివుని ఇమేజ్ ఈ పోస్టర్‌ని మరింత ఎలివేట్ చేస్తోంది.

సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాతో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేర్న అరోరా, సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి శివిన్ నారంగ్, ప్రేర్న అరోరా, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని ఈ పోస్టర్ మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇంతకు ముందు సుధీర్ బాబు చేసిన హరోం హర సినిమా కూడా శివుని పేరు మీదే కావడం విశేషం.

Sudheer Babu Next film Title Jatadhara

sudheer babu
jatadhara