ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Salaar 2 Shauryaanga Parvam Will Kick Start From May

సలార్ 2 షూటింగ్ పై క్రేజీ అప్ డేట్

సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలుకావాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వలన సలార్ 2 షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ప్రశాంత్ నీల్ సలార్ 2 స్రిప్ట్ ఇంకా నటుల డేట్స్ ని సెట్ చేసుకుంటూ సలార్ 2 ని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సలార్ పార్ట్ 1 లో వరదరాజ మన్నార్ గా నటించిన పృథ్వీ రాజ్ సుకుమారన్, మరో కీలక పాత్రధారి బాబీ సింహ లు సలార్ 2 షూటింగ్ కోసం పూర్తిగా ప్రిపేర్ అవుతున్నారు. 

ఇటు ప్రభాస్ కూడా కల్కి షూటింగ్ పూర్తి కావడంతో మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ అలాగే ఇప్పుడు సలార్2 షూటింగ్ కోసం రెడీ అవుతారని తెలుస్తోంది. సలార్ 2 షూటింగ్ మే నుంచి మొదలు కాబోతునట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్-పృథ్వీ రాజ్ సుకుమారన్ ల కాంబో సీన్స్ తో సలార్ సౌర్యంగా పర్వం మొదలు పెట్టబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. 

ఇక ఈ పార్ట్ లో శృతి హాసన్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందట. శృతి కూడా సలార్ 2 షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫైన్ సిటీలోనే మేజర్ పార్ట్ షూటింగ్ ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడ వేసిన సలార్ సెట్ లోనే ఇప్పుడు షూటింగ్ మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. 

All Set For Salaar 2 Shoot

Salaar 2 Shauryaanga Parvam Will Kick Start From May
salaar 2